పరాన్నజీవి : ఆర్జీవీ పాత్రలో ప్రముఖ కమెడియన్‌ | Paranna Jeevi Movie First Look Released | Sakshi
Sakshi News home page

పరాన్నజీవి : ఆర్జీవీ పాత్రలో ప్రముఖ కమెడియన్‌

Jul 22 2020 3:56 PM | Updated on Jul 22 2020 4:08 PM

Paranna Jeevi Movie First Look Released - Sakshi

హైదరాబాద్‌ : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘రెక్‌లెస్‌ జెనెటిక్‌ వైరస్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 కంటెస్టెంట్‌ నూతన్‌ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 99 థియేటర్‌ బ్యానర్‌పై సీఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను చిత్ర బృందం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. (ట్రైలర్‌ రిలీజ్‌; ఆ డబ్బు వాపసు: వర్మ)

ఈ చిత్రంలో లీడ్‌ పాత్రలో జబర్దస్త్‌ కమెడియన్‌ షకలక శంకర్‌ నటిస్తున్నారు. పరాన్న జీవి ఫస్ట్‌ లుక్‌లో.. ఆర్జీవీ పాత్ర ఓ నటిని‌ డైరెక్ట్‌ చేస్తున్న స్టిల్‌ చూపెట్టారు. ఈ చిత్రాన్ని జూలై 25న 11 గంటలకు శ్రేయాస్‌ ఈటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గతంలో ఆర్జీవీని అనుకరిస్తూ శంకర్‌ చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్జీవీ తెరకెక్కిస్తున్న పవర్‌స్టార్‌ చిత్రం ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింతగా టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఆర్జీవీ మూవీకి కౌంటర్‌గా పవన్‌ అభిమానులు పరాన్న జీవి ప్రొమోషన్స్‌ చేస్తున్నారు. మొత్తానికి  ఈ రెండు చిత్రాలు కూడా జూలై 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.(ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌బై: నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement