ఆసక్తికరంగా ‘పలాస 1978’ ట్రైలర్‌ | Palasa 1978 Telugu Movie Trailer Out | Sakshi
Sakshi News home page

రానా చేతుల మీదుగా పలాస 1978 ట్రైలర్‌

Mar 1 2020 7:43 PM | Updated on Mar 1 2020 7:50 PM

Palasa 1978 Telugu Movie Trailer Out - Sakshi

ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉందే

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. 'పలాస 1978' ట్రైలర్‌ని ఆదివారం ట్విట్టర్‌లో లాంచ్ చేసిన రానా టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

ట్రైలర్ మొదలు కావడంతోనే పలాస 1978లో జరిగిన ఓ హత్య గురించి ఉంటుంది. తర్వాత హీరో రక్షిత్ ‘బురదలోకి దిగిపోయాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవే.. ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉందే’ అంటూ హీరోయిన్ తో చెప్పే డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించారు.

కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రోత్సాహం అందించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు.  ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి విభిన్నమైన సినిమాను ప్రమోట్ చేసిన రానా  ‘పలాస 1978’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నయని రానా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement