ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్లో ఆస్కార్ వేడుక! | Oscar ceremony to stream online for first time | Sakshi
Sakshi News home page

ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్లో ఆస్కార్ వేడుక!

Mar 2 2014 12:39 AM | Updated on Sep 2 2017 4:14 AM

ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్లో ఆస్కార్ వేడుక!

ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్లో ఆస్కార్ వేడుక!

ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ పండగ సందడి మొదలైంది. ఈరోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో సుమారు ఐదున్నర గంటలకు

 ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ పండగ సందడి మొదలైంది. ఈరోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో సుమారు ఐదున్నర గంటలకు డాల్బీ థియేటర్‌లో ఆరంభమవుతుంది ఈ వేడుక. మన భారతీయ కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము అన్నమాట. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆస్కార్ కమిటీ మరో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్లో ఆస్కార్ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అయితే యూఎస్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement