ఆ నటుడు చచ్చిన కుక్కకు గుడ్‌ నైట్‌ చెప్తాడు..

Orlando Bloom Mounted His Dog Skeleton At Home - Sakshi

రాత్రి నిద్రపోయేముందు చచ్చిపోయిన తన కుక్కుకు గుడ్‌ నైట్‌ చెప్తానంటున్నాడు ఆర్లాండో బ్లూమ్‌ అనే హాలీవుడ్‌ నటుడు. 2004లో కింగ్‌డమ్‌ ఆఫ్‌ హెవెన్‌ ఇన్‌ మొరాక్కో సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో.. ఓ వీధి కుక్క ఆర్లాండోను ఓ ప్రమాదంనుంచి రక్షించింది. దీంతో అతడు సాలుకి మిక్స్‌ జాతికి చెందిన ఆ కుక్కను అక్కున చేర్చుకున్నాడు. దానికి సిధి అని పేరు పెట్టి ఆప్యాయంగా చూసుకునేవాడు. దురదృష్టవశాత్తు లివర్‌ సంబంధిత  వ్యాధి కారణంగా సిధి 2015లో మరణించింది. సిధి మరణంతో కలతచెందిన ఆర్లాండో! దాని గుర్తుగా ఎముకల గూడును ఇంటి ముందు ఏర్పాటు చేశాడు.

ఈ విషయంపై ఆర్లాండో మాట్లాడుతూ.. ‘‘ సిధి నాకు ఎప్పుడూ తోడుగా ఉండేది. అది చనిపోయినపుడు నేను చాలా కలతచెందాను. చనిపోయినా సిధి నాతోనే ఉండాలన్న ఉద్ధేశ్యంతో దాని ఎముకల గూడును ఇంటిముందు ఏర్పాటు చేశాను. అది కొంతమందికి వింతగా అన్పించవచ్చు. కానీ అలా చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ప్రతి రోజు రాత్రి నిద్రపోయేముందు దానికి గుడ్‌ నైట్‌ చెబుతుంటాన’’ని తెలిపాడు. ఆర్లాండో ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top