breaking news
Lord of the Rings
-
వెబ్ సీరిస్ కథ కోసమే రూ.1500 కోట్లు
-
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
టైటానిక్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలతో చాలా పేరు తెచ్చుకున్న నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈయన అభిమానులు, పలువురు నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)యూకేకి చెందిన బెర్నార్డ్ హిల్.. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. టీవీ, సినిమా, థియేటర్ రంగాల్లో నటుడిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్లో క్లాసిక్ సినిమాలైన 'టైటానిక్'లో షిప్ కెప్టెన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రాయాలజీలో కింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)It’s with great sadness that I note the death of Bernard Hill. We worked together in John Paul George Ringo and Bert, Willy Russell marvellous show 1974-1975. A really marvellous actor. It was a privilege to have crossed paths with him. RIP Benny x#bernardhill pic.twitter.com/UPVDCo3ut8— Barbara Dickson (@BarbaraDickson) May 5, 2024 -
రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్!
17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది. -
ఆ నటుడు చచ్చిన కుక్కకు గుడ్ నైట్ చెప్తాడు..
రాత్రి నిద్రపోయేముందు చచ్చిపోయిన తన కుక్కుకు గుడ్ నైట్ చెప్తానంటున్నాడు ఆర్లాండో బ్లూమ్ అనే హాలీవుడ్ నటుడు. 2004లో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇన్ మొరాక్కో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఓ వీధి కుక్క ఆర్లాండోను ఓ ప్రమాదంనుంచి రక్షించింది. దీంతో అతడు సాలుకి మిక్స్ జాతికి చెందిన ఆ కుక్కను అక్కున చేర్చుకున్నాడు. దానికి సిధి అని పేరు పెట్టి ఆప్యాయంగా చూసుకునేవాడు. దురదృష్టవశాత్తు లివర్ సంబంధిత వ్యాధి కారణంగా సిధి 2015లో మరణించింది. సిధి మరణంతో కలతచెందిన ఆర్లాండో! దాని గుర్తుగా ఎముకల గూడును ఇంటి ముందు ఏర్పాటు చేశాడు. ఈ విషయంపై ఆర్లాండో మాట్లాడుతూ.. ‘‘ సిధి నాకు ఎప్పుడూ తోడుగా ఉండేది. అది చనిపోయినపుడు నేను చాలా కలతచెందాను. చనిపోయినా సిధి నాతోనే ఉండాలన్న ఉద్ధేశ్యంతో దాని ఎముకల గూడును ఇంటిముందు ఏర్పాటు చేశాను. అది కొంతమందికి వింతగా అన్పించవచ్చు. కానీ అలా చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ప్రతి రోజు రాత్రి నిద్రపోయేముందు దానికి గుడ్ నైట్ చెబుతుంటాన’’ని తెలిపాడు. ఆర్లాండో ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడే. -
రూ.10 కోట్లు ఇస్తానన్నా పౌరోహిత్యం చేయనన్నాడు!
న్యూయార్క్: పెళ్లిచేసే పురోహితుడికి సంభావనగా ఎన్ని డబ్బులిస్తాం.. మహా అయితే రూ.10 వేలకు మించవు. కానీ అమెరికాలోని ఓ వ్యాపారవేత్త పురోహితుడికే ఏకంగా రూ.10 కోట్లు ఇస్తానన్నాడట. విచిత్రమేంటంటే అంత డబ్బు ఇస్తానన్నా ఆ పురోహితుడు అంగీకరించలేదట! విషయం ఏంటంటే.. హాలీవుడ్ హిట్ సినిమా 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' చూశారుగా, అందులో గాండల్ఫ్ పాత్రధారి, హాలీవుడ్ సీనియర్ నటుడు ఇయాన్ మెక్ కెల్లెన్ (77) మన కథనంలో పురోహితుడు. సరిగ్గా ఆ సినిమాలోని గెటప్ వేసుకుని తన కుమారుడి పెళ్లి తంతు నిర్వహించాలని ఇయాన్ ను కోరాడు న్యూయార్క్ వ్యాపారవేత్త. కానీ ఇయాన్ ఈ కండిషన్ ను, ఆఫర్ ను తిరస్కరించాడు. 'అర్రె.. ఎందుకిలా చేశావ్? ఐదు నిమిషాల పెళ్లికి పది కోట్లు మంచి ఆఫరే కదా! ఎందుకు వదులుకున్నావ్?' అని స్నేహితులు అడితే అందుకు ఇయాన్.. 'మాంత్రికుడైన గాండల్ఫ్ శుభకార్యాలైన పెళ్లిళ్లు గట్రాకు పౌరోహిత్యం నిర్వహించడని, అందుకే తనకొచ్చిన ఆఫర్ తిరస్కరించానంటూ చమత్కరించారు. -
లార్డ్ ఆఫ్ ది ఆస్కార్స్
లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ బి. విఠలాచార్య తెలుసా? మాయలు, మంత్రాలు, కత్తులు, బాణాల ఫైటింగులకు క్రేజ్ తెచ్చిన దర్శక మొనగాడు. హాలీవుడ్ చిత్రం ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చూస్తుంటే, అచ్చంగా మనకు బ్లాక్ అండ్ వైట్ విఠలాచార్య సినిమాలు గుర్తుకురాకపోతే ఒట్టు! అందుకే, పిల్లల నుంచి పెద్దల దాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది - ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. ఇది మొత్తం మూడు భాగాల సిరీస్. వాటిలో మూడోదీ, ఆఖరుదీ ఈ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’. పుష్కరకాలం క్రితం విడుదలైన ఈ థర్డ్ పార్ట్ది అరుదైన రికార్డ్! అకాడమీ అవార్డులు ఆరంభమైన తరువాత అత్యధిక సంఖ్యలో (11) ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాలు - ‘బెన్హర్’ (1959), ‘టైటానిక్’ (1997). ఆ తరువాత మళ్ళీ ఇదే. ‘ఉత్తమ చిత్రం’తో సహా నామినేటైన 11 కేటగిరీల్లోనూ ఆస్కార్ అవార్డుల్ని స్వీప్ చేసింది. ఇది మామూలుగా ఆస్కార్స వచ్చే చిత్రాలకు భిన్నమైన సినిమా. మరుగుజ్జులు, మనుషులలానే కనిపిస్తూ పాదాలకు జుట్టుండే మూడడుగుల మనుషులైన వారి హాబి ట్లు, అతీతశక్తులుండే చిట్టి పొట్టి జంతువులు, మ్యాజిక్ రింగులతో నిండిన ఫ్యాంటసీ. నటీనటులు కూడా జనానికి తెలిసినవాళ్ళేమీ కాదు. లో-బడ్జెట్ హార్రర్ చిత్రాలు తీసే ఫిల్మ్ మేకరేమో (పీటర్ జాక్సన్) దర్శకుడు. పైగా, సినిమాలకు అవార్డులొచ్చే లాస్ ఏంజెల్స్‌కు దూరంగా రచన, చిత్రీకరణ, ఎడిటింగ్ - మొత్తం న్యూజిలాండ్‌లో జరిగాయి. అయినాసరే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఆస్కార్లు గెలుచుకుంది. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడైన నవలల్లో ఒకటి -‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. జాన్ రొనాల్డ్ రూయెల్ టోల్కిన్ మొత్తం మూడు సంపుటాలుగా ఈ నవల రాశారు. ఈ నవలను సినిమా కన్నా ముందే రేడియాలో, రంగస్థలం మీద వేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1937 నుంచి 1949 మధ్య ఈ రచన సాగింది. మిడిల్ ఎర్త్ ప్రాంతంలో... ఎల్విష్ భాష మాట్లాడే కొన్ని జాతుల మధ్య జరిగినట్లుగా టోల్కిన్ ఈ కాల్పనిక కథను అల్లారు. నవలా రచయిత టోల్కిన్కు ఒక అలవాటుంది. ప్రపంచంలో కనుమరుగైపోతున్న భాషలను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న భాషల ప్రాథమిక సూత్రాలనూ, మాండలికాలనూ వాడుకుంటూ, వాటికి తన ఆలోచన జోడించి, సరికొత్త భాషలో కవితలు, పాటలు రాయడం ఆయన హాబీ. ఈ నవలలో యువరాణి ఆర్వెన్ పాత్రధారిణి మాట్లాడేది - ఎల్విష్ భాష. షూటింగ్లో ఆ పాత్రధారిణికి ఈ భాష నేర్పడానికి సెట్స్ మీదే ఒక కోచ్‌ను పెట్టారు. వాళ్ళిద్దరికీ అర్థం కానిది ఏమైనా ఉంటే వివరించడానికి ఒక నిపుణుణ్ణి అమెరికాలో సిద్ధంగా ఉంచారు. అసలీ ప్రసిద్ధ నవలను సినిమాగా తీయాలని 1969లోనే హక్కులు తీసుకున్నారు. అప్పటికే సైన్స్ ఫిక్షన్ సినిమా ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’తో దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్ ఒక సంచలనం. ఆయనతో ఈ నవలను తెరకెక్కించాలనుకున్నారు. కానీ, బోలెడన్ని పాత్రలు, చాంతాడంత కథ ఉన్న ఇంత నవలను చిన్న సినిమాగా కుదించలేమంటూ నో చెప్పారట. మంచికో, చెడుకో అలా ఆగిన ఆ వెండితెర కల 30 ఏళ్ళ తరువాత పీటర్ జాక్సన్ దర్శకత్వంలో నిజమైంది. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మూడు పార్ట్‌లుగా వచ్చినా, తీయడం మాత్రం అన్నీ ఒకేసారి తీసేశారు. ఏణ్ణర్ధం పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ, ఒక్కో పార్ట్‌గా రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో - ‘ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్’. రెండో పార్టేమో - ‘ది టు టవర్స్’. నవలలోని రెండు, మూడు సంపుటాలను కలిపి ఈ మూడో పార్ట్ సినిమా ‘ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ తీశారు. న్యూజిలాండ్‌లో వందకు పైగా వేర్వేరు లొకేషన్స్... 350కి పైగా సెట్స్ వాడారు. ఈ లొకేషన్స్‌కు యాక్టర్లనీ, టెక్నీషియన్లనీ హెలికాప్టర్లో తరలించేవారు. సుదీర్ఘంగా సాగిన షూటింగ్లో, యుద్ధ సన్నివేశాల్లో దెబ్బలు తగలనివాళ్ళంటూ లేరు. కిందపడ్డారు. కాళ్ళు మెలికపడ్డాయి. వేళ్ళు విరిగాయి. కండరాలు పట్టేశాయి. వాపులు... గాయాలు... రక్తాలు... అయినా సరే ఆగకుండా సినిమా చేశారు. ఆ కష్టం వృథా కాలేదు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫస్ట్ పార్ట్ ప్రీమియర్ షో వేశారు. జనంలోకి సినిమా వెళ్ళీవెళ్ళగానే ఆ చిత్రంలోని ప్రధాన పాత్రధారులందరూ రాత్రికి రాత్రికి జనంలో సూపర్స్టార్లైపోయారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సిరీస్‌లో మూడు సినిమాలూ గొప్పగా ఉంటాయి. మూడింటికీ బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ఈ సినిమాల కోసం కాస్ట్యూమ్, మేకప్ బృందాలు వెయ్యి యుద్ధ కాస్ట్యూమ్‌లు చేశాయి. ముఖానికి 10 వేల ప్రోస్థెటిక్స్ చేశారు. ఏకంగా 1800 హాబిట్ పాదాల తయారీ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు ఎక్కింది. ఒక్క మూడో పార్ట్‌లో దాదాపు 1500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ఉన్నాయి. ఒక్కో పార్ట్ రిలీజైన కొద్దీ ఈ సిరీస్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. 2003 చివరలో మూడో పార్ట్ వచ్చింది. ప్రపంచ సినీ చరిత్రలో 100 కోట్ల డాలర్లు వసూలు చేసిన రెండో సినిమా ఇదే. మూడో పార్ట్‌లో 1700 మందికి పైగా పేర్లు రోలింగ్ టైటిల్స్‌లో వస్తాయి. ఆ టైటిల్స్ నిడివే - తొమ్మిదిన్నర నిమిషాలు. అంత మంది శ్రమకు ఫలితమైన ఈ సినిమా ఇవాళ చూసినా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వీలుంటే చూడండి. సమ్మర్లో 3 పార్ట్‌లూ ఒక దాని తరువాత ఒకటిగా పిల్లలకూ డి.వి.డి.లో చూపెట్టండి. - రెంటాల