‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది

Oorantha Anukuntunnaru Is Slated For Dussehra Release - Sakshi

‘‘ఊరంతా అనుకుంటున్నారు’ ట్రైలర్‌ చూస్తే నవీన్‌ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విజయనిర్మలకు అంకితం ఇస్తున్నారు. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నవీన్‌ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలి’’ అని నటుడు కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ ఫేమ్‌ నవీన్‌ విజయ్‌ కృష్ణ హీరోగా బాలాజి సానల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నవీన్‌ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజి చెప్పిన పాయింట్‌ నచ్చి ఈ సినిమా చేశా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది.

ఇకపై గ్యాప్‌ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘విజయ నిర్మలగారికి నవీన్‌ మంచి నటుడు కావాలని ఉండేది. ఆమె అనుకున్నట్లే ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఊరంతా అనుకుంటున్నారు’తో నవీన్‌ కుటుంబ ప్రేక్షుకులకు దగ్గరవుతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు నరేశ్‌ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ‘‘నా కథకి నవీన్‌ అయితేనే న్యాయం చేయగలడు అనిపించింది’’ అన్నారు బాలాజి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీహరి మంగళంపల్లి అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top