బాలీవుడ్ భామ భోరుమందట | Oh no! Why did Katrina Kaif burst into tears in public? | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ భామ భోరుమందట

Oct 29 2015 11:26 AM | Updated on Sep 3 2017 11:41 AM

బాలీవుడ్ భామ భోరుమందట

బాలీవుడ్ భామ భోరుమందట

మై నేమ్ ఈజ్ షీలా... అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కత్రినా కైఫ్ భోరున విలపించిందట.

ముంబై: మై నేమ్ ఈజ్ షీలా... అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కత్రినా కైఫ్ భోరున విలపించిందట. కత్తి లాంటి కత్రినా ఏడవడం ఏంటీ..  ఏదో  సినిమా కోసం అయి ఉంటుంది అనుకుంటున్నారా? కాదు నిజంగానే పబ్లిగ్గా ఏడ్చేసిందట. పాపం ఈ అమ్మడికి  ఏం కష్టమొచ్చిందో ఏమో  తెలియదు గానీ  ముంబై బాద్రాలోని ఒక చర్చిలో కళ్లనీళ్లు పెట్టుకుందిట.  అక్కడ మేరీమాత ముందు తనను తాను నియంత్రించుకోలేక విలపించిందట. వెంటనే ఓ మీడియాకు సంబంధించిన వ్యక్తి ఫోటోలు తీశాడు.. అయితే వెంటనే తేరుకున్న కత్రినా తన ఫొటోలు బయట పెట్టొద్దని ప్రాధేయడిందట.  కానీ ఆ వార్త అంతటితో ఆగలేదు.

బాలీవుడ్ ముద్దుగుమ్మ కన్నీళ్లు పెట్టుకున్న విషయం అలా అలా చక్కర్లు  కొట్టి ఇపుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అయింది. అసలు కత్రినా ఎందుకు ఏడ్చింది.. ఏమైంది అనే చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయ. బాయ్ ఫ్రెండ్ రణబీర్ విషయంలో ఏమైనా తేడాలొచ్చాయా? అందుకే ఏడ్చిందా ఇలా రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే మొదట సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన కత్రినా ఆ తరువాత అతనితో విడిపోయి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్లుగా డీప్ లవ్ లో  మునిగి తేలిన  కత్రినా, రణబీర్లు.. ఇదిగో  పెళ్లి  అదిగో పెళ్లి అంటూ మురిపించారు. కానీ ఈ ముచ్చట తీరింది లేదు. అందుకే కత్రినా అప్ సెట్ అయ్యిందా.. ఆ ఒత్తిడిని భరించలేకే  బహిరంగంగా భోరుమందా అనుకుంటున్నారు.

అటు కత్రినా పెళ్లికి రెడీగా ఉన్నా.. రణబీర్ మాత్రం ఈ విషయాన్ని ఏటూ తేల్చడంలేదని కొంతమంది చెబుతున్నారు. దీంతో ఈ ఫ్రస్ట్రేషన్ లోనే కత్రినా ఏడ్చేసి ఉంటుందని  బాలీవుడ్ జనాల అంచనా. కాగా కత్తి లాంటి కత్రినా  కైఫ్  ఓపక్క హీరోయిన్‌గా చేస్తూనే, ప్రత్యేక గీతాల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. మొదట్లో డ్యాన్స్ లు చేయడానికి తడబడినా తరువాత  ఐటెం సాంగ్స్ లో ఇరగదీస్తూ దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement