విజయనగరం: బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం | Vizianagaram: Flames Erupted After The Bus Wheel Burst | Sakshi
Sakshi News home page

విజయనగరం: బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Mar 21 2026 7:33 AM | Updated on Mar 21 2026 7:33 PM

Vizianagaram: Flames Erupted After The Bus Wheel Burst

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తారాపురం సమీపంలో ప్రైవేటు బస్సు వెనుక టైర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. భువనేశ్వర్‌ నుంచి మల్కన్‌ గిరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టైర్‌ పేలగానే అప్రమత్తమైన డ్రైవర్‌.. ప్రయాణికులను దించేశారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఒడిశాకు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బస్సు వెనుక టైరు పేలడంతో చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిద

Advertisement
 
Advertisement
Advertisement