ఓరి దేవుడా! | Oh My God ' | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా!

Nov 7 2015 12:09 AM | Updated on Sep 3 2017 12:08 PM

ఓరి దేవుడా!

ఓరి దేవుడా!

శ్రీవెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి. శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ‘ఓ మైగాడ్’.

శ్రీవెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి. శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ‘ఓ మైగాడ్’. తనీష్, మేఘశ్రీ, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీత దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో నిర్మాత డి.ఎస్.రావు సీడీని  ఆవిష్కరించి, దర్శక-రచయిత శివశక్తి దత్తాకు అందించారు. ‘‘నా శిష్యుడు శ్రీవాత్సవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని శివశక్తి దత్తా అన్నారు.

ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తనీష్  పేర్కొన్నారు. చంద్రమహేశ్ దగ్గర ‘హనుమంతు’ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేశాననీ, విజయేంద్ర ప్రసాద్ దగ్గర కూడా చేసిన అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, చంద్రమహేష్, మేఘశ్రీ పాల్గొన్నారు.ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రాజు తోట, కో-ప్రొడ్యూసర్: చనమాల పురుషోత్తం.
 

Advertisement
 
Advertisement
Advertisement