పాటల సమేతంగా..!

NTR's Aravinda Sametha Veera Raghava Audio Release Date fixed - Sakshi

‘రం... రుధిరం.. రం.. శిశిరం... రం.. సమరం’... ఇది ‘అరవింద సమేత వీరరాఘవ’ టీజర్‌ చివర్లో బ్యాగ్రౌండ్‌లో మ్యూజిక్‌. శాంపిల్‌గా వదిలినా ఈ మ్యూజిక్కే ఫ్యాన్స్‌కు అంత కిక్‌ ఇస్తే.. ఇక ఫుల్‌ పాటలను వదిలితే వచ్చే డబుల్‌ కిక్‌ ఎలా ఉంటుందో ఈ నెల 20న తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా పాటలను ఆ రోజు రిలీజ్‌ చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. వినాయక చవితి సందర్భంగా   చిత్రంలోని  ఎన్టీఆర్‌ కొత్త స్టిల్‌ని రిలీజ్‌ చేసి, పాటలను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. అక్టోబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top