మా అక్కకు ఇది కష్టకాలం: కరీనా | nobody knows facts about karishma, says sister kareena kapoor khan | Sakshi
Sakshi News home page

మా అక్కకు ఇది కష్టకాలం: కరీనా

Apr 14 2016 11:07 AM | Updated on Sep 3 2017 9:55 PM

మా అక్కకు ఇది కష్టకాలం: కరీనా

మా అక్కకు ఇది కష్టకాలం: కరీనా

కరిష్మాకు ఇది చాలా కష్టకాలమని ఆమె సోదరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది.

కరిష్మాకపూర్ విడాకుల వ్యవహారం గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నారు గానీ, ఆమె జీవితానికి సంబంధించిన నిజం ఏంటో ఎవరికీ తెలియదని ఆమె సోదరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ ఖాన్ చెబుతోంది. అయితే ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారం కాబట్టి తాను మాత్రం దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనంది. ఇది కరిష్మాకు చాలా కష్టకాలమని మాత్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆమెకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

నిజానికి కరిష్మాకపూర్ విడాకుల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పర అంగీకారంతో సంజయ్ కపూర్ నుంచి విడాకులు తీసుకుంటుందని అందరూ భావించినా, కరిష్మా మాత్రం కేసు పోరాడతానంటూ ముందుకెళ్లింది. సుదీర్ఘకాలం వాదనల తర్వాత మళ్లీ చివరకు పరస్పర అంగీకారంతోనే విడాకులు మంజూరయ్యాయి.

అంతకుముందు సంజయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. కానీ సందీప్‌కు అప్పటికే పెళ్లి అయిపోవడం, అతడికి ఇంకా విడాకులు రాకముందే కరిష్మాతో తిరిగితే ఇబ్బంది అవుతుందని న్యాయవాదులు చెప్పడంతో అతడు కూడా ఆమెకు కొంతకాలం దూరమయ్యాడు. అతడికి కూడా విడాకులు వస్తే ఆ తర్వాత వీళ్లిద్దరి బంధం ఎటు తిరుగుతుందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement