రొమాంటిక్‌ భీష్మ | nithin new movie bisma launch | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ భీష్మ

Jun 13 2019 12:32 AM | Updated on Jun 13 2019 12:32 AM

nithin new movie bisma launch - Sakshi

వెంకీ, రాధాకృష్ణ, పీడీవీ ప్రసాద్, నాగవంశీ, నితిన్, రష్మికా మండన్నా

నితిన్, రష్మికా మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. సరదా సంఘటనలతో సాగుతుంది. ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే స్క్రిప్ట్‌ బాగా వచ్చినందుకు టీమ్‌ అంతా వెరీ హ్యాపీ.

ప్రతి అబ్బాయి నితిన్‌గారి క్యారెక్టర్‌కి, ప్రతి యువతి రష్మిక పాత్రకి కనెక్ట్‌ అయ్యేలా స్క్రిప్ట్‌ రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ నెల 20న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్‌ తదితరులు నటించనున్న ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సాయి శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకట రత్నం (వెంకట్‌), సమర్పణ: పీడీవీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement