ఎప్పటికీ ఒంటరిగానే! | Nithin new movie Bheeshma title logo launched | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ ఒంటరిగానే!

Mar 30 2019 1:18 AM | Updated on Mar 30 2019 1:18 AM

Nithin new movie Bheeshma title logo launched - Sakshi

నితిన్‌,రష్మికామండన్నా

మూడుపదుల వయసు దాటిన హీరో నితిన్‌ ఇంకా వివాహం చేసుకోలేదు. శుక్రవారం ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ (ఎప్పటికీ ఒంటరిగా) అంటూ ఓ ప్రకటన ఇప్పించారు. ఇది చదివి ఇక నితిన్‌ ఎప్పటికీ బ్యాచిలర్‌గా మిగిలిపోతాడేమో అని ఊహించుకోకండి. ఒంటరిగా ఉంటానని నితిన్‌ చెప్పింది ‘భీష్మ’ చిత్రం గురించి. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా రూపొందనున్న సినిమా ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ రోజు నితిన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘భీష్మ’ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ‘‘తొమ్మిది గ్రహాలు.. ఏడుసముద్రాలు.. 204 దేశాలు... మూడు బిలియన్స్‌ పైగా అమ్మాయిలు ఉన్నారు. కానీ అతను స్టిల్‌ సింగిల్‌ గానే ఉన్నాడు’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. మరి.. సినిమాలో భీష్మ బ్యాచిలర్‌ ౖలñఃఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టించడానికి హీరోయిన్‌ ఏం చేసింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement