సూర్య వర్సెస్ సూర్య | nikhil new movie starts | Sakshi
Sakshi News home page

సూర్య వర్సెస్ సూర్య

Aug 12 2014 12:10 AM | Updated on Sep 2 2017 11:43 AM

సూర్య వర్సెస్ సూర్య

సూర్య వర్సెస్ సూర్య

నిఖిల్ కథానాయకునిగా, ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రానికి ‘సూర్య వర్సస్ సూర్య’ అనే పేరును ఖరారు చేశారు.

నిఖిల్ కథానాయకునిగా, ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రానికి ‘సూర్య వర్సస్ సూర్య’ అనే పేరును ఖరారు చేశారు. నేటి నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘‘స్వామి రారా’, ‘కార్తికేయ’ తరహాలోనే నిఖిల్ చేస్తున్న మరో భిన్నమైన సినిమా ఇది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. కథానాయికను త్వరలో ఎంపిక చేస్తాం’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్యం.

Advertisement
 
Advertisement
Advertisement