నిఖిల్‌ వెనుకడుగు వేయకతప్పలేదు! | Nikhil Mudra Movie May Be Postponed | Sakshi
Sakshi News home page

Oct 27 2018 9:05 AM | Updated on Oct 27 2018 9:59 AM

Nikhil Mudra Movie May Be Postponed - Sakshi

‘కేశవ’, ‘కిరాక్‌ పార్టీ’ సినిమాలతో కాస్త వెనుకపడ్డాడు యంగ్‌ హీరో నిఖిల్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తీసి విజయాలు సాధించిన ఈ హీరో గత రెండు సినిమాలతో ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాడు. తాజాగా ఓ తమిళ రీమేక్‌తో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. 

తమిళ్‌లో ఘన విజయం సాధించిన కణిథన్‌ సినిమాను తెలుగులో ‘ముద్ర’ పేరుతో నిఖిల్‌ రీమేక్‌ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్‌ 8న రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ నవంబర్‌ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లపై దాడి చేయనున్నాయి. విజయ్‌ ‘సర్కార్‌’, ఆమిర్‌ ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ దీపావళి కానుకగాకే విడుదల కానుండగా.. రజనీకాంత్‌ 2.ఓ నవంబర్‌ చివరి వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిఖిల్‌ తన ‘ముద్ర’ను డిసెంబర్‌లో వేయబోతున్నాడని సమాచారం. ఈ మూవీలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement