నిక్‌, ప్రియాంకల నివాసం ఇదే.. | Nick Jonas Love Nest Revealed | Sakshi
Sakshi News home page

నిక్‌, ప్రియాంకల నివాసం ఇదే..

Oct 24 2018 4:07 PM | Updated on Oct 24 2018 4:57 PM

Nick Jonas Love Nest Revealed - Sakshi

ప్రియాంక, నిక్‌ జొనాస్‌ల కోసం ఖరీదైన భవనం ముస్తాబు

లాస్‌ఏంజెల్స్‌ : అమెరికాలోని  బెవెర్లీ హిల్స్‌లో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ల నివాసం హాట్‌ టాపిక్‌లా మారింది. ప్రియాంకకు ప్రపోజ్‌ చేసేందుకు మూడు నెలల ముందు నిక్‌ జొనాస్‌ 65 మిలియన్‌ డాలర్లు వెచ్చించి ఈ ఇంటిని కొనుగోలు చేశాడు. ఐదు పడకగదులు, నాలుగు స్నానపు గదులతో 4129 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ లగ్జరీ మాన్షన్‌ను ఇటీవల కొత్త జంటకు అనుగుణంగా తీర్చిదిద్దారు.

ఇండోర్‌, అవుట్‌డోర్‌ లైఫ్‌స్టైల్‌తో నివసించేలా ఇంటిని డిజైన్‌ చేయడం ఆకట్టుకుంటోంది. లివింగ్‌ ఏరియా, మాస్టర్‌ బెడ్‌రూమ్‌, కోర్ట్‌యాడ్‌ల మధ్య ఖరీదైన స్లైడింగ్‌ గ్లాస్‌ వాల్స్‌తో పార్టీలకు సరైన ప్లేస్‌గా మలిచారు. ప్రధాన ప్రాపర్టీ పక్కనే సకల సౌకర్యాలతో గెస్ట్‌ హౌస్‌ను నిర్మించారు.

డెవలప్‌మెంట్‌ కంపెనీ గ్రౌండప్‌ లాస్‌ ఏంజెల్స్‌, ప్రముఖ ఆర్కిటెక్చర్‌ కంపెనీ స్పేస్‌ ఇంటర్నేషనల్‌, ల్యాండ్‌స్కేప్‌ డిజైనర్‌ కాత్లీన్‌ ఫెర్గూసన్‌లు ఈ ప్రాజెక్టును నిక్‌, ప్రియాంకల అభిరుచికి అనుగుణంగా రూపొందించారు.వచ్చే ఏడాదే నిక్‌, ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటై ఈ విలాసవంతమైన భవనంలో విడిది చేస్తారని భావిస్తున్నారు. డైలీమెయిల్‌ పోర్టల్‌ నిక్‌ నివాసానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఫోటోలను బహిర్గతం చేసింది.

1
1/2

2
2/2

Advertisement
 
Advertisement
Advertisement