భవిష్యత్‌లో తీసుకుంటా

New telugu movie updates - Sakshi

అభిలాష్‌ వాడాడ హీరోగా, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’. ‘రెయిన్‌ చెక్‌‘ అంటే ఇచ్చిన ఆఫర్‌ను భవిష్యత్‌లో తీసుకుంటాను అని అర్థం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ ట్రెండీ లవ్‌ స్టోరీని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత శరత్‌ మరార్‌ సమర్పిస్తుండటం విశేషం. ఆకెళ్ల పేరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఆఫీస్‌ నేపథ్యంలో నడిచే చిత్రమిది.

లవ్‌ , అడ్వెంచర్, పెయిన్, ఫన్‌.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. మా నటీనటులు రియల్‌గా అడ్వెంచర్‌ చేయటం విశేషం. హాలీవుడ్‌ చిత్రాల సమర్పకులు ఆండీ కొహెన్‌కి మా సినిమా నచ్చడంతో అంతర్జాతీయ భాషలలో చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి ముందుకొచ్చారు’’ అన్నారు. ‘‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’ నా తొలి సినిమా. కార్పొరేట్‌ లవ్‌స్టోరీ ఎవ్వరినీ డిజప్పాయింట్‌ చెయ్యదు’’ అన్నారు అభిలాష్‌. ‘‘శ్రీనివాస్‌గారు చాలా క్లారిటీగా ఈ సినిమా తీశారు. ప్రతి పాత్ర అందంగా ఉంటుంది. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కథానాయికలు ప్రియా, మౌనిక. సంగీత దర్శకుడు దీపక్‌ కిరణ్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top