చిత్రకారుడి కథ

new telugu movie updates - Sakshi

మాజీ మిస్టర్‌ ఆంధ్ర బాల్వాన్, ప్రాచీ అధికారి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ సౌధం’. ఎస్‌.కె. మజ్నుని దర్శకునిగా పరిచయం చేస్తూ మజ్ను రెహానా బేగమ్, మజ్ను సోహ్రబ్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఎం.ఎం. ఖాజా మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
 

ఈ చిత్రంలో ఒక ఫైట్, ఆరు పాటలుఉన్నాయి. ఈ నెల 11న పాటలు విడుదల చేస్తాం. ఆగస్టు 9న సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక చిత్రకారుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనతో ఈ చిత్రకథ రాశా. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. మా సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కూడా నేనే అందించా’’ అన్నారు దర్శకుడు మజ్ను. సాయికిరణ్, మౌనిక, సత్య ప్రకాష్, కవిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top