దీపిక నడుమును కవర్‌ చేసి.. | The new Ghoomar song is with covering Deepika midriff | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో కొత్త ‘ఘూమర్‌’ పాట

Jan 20 2018 1:58 PM | Updated on Jan 20 2018 1:58 PM

The new Ghoomar song is with covering Deepika midriff - Sakshi

అనేక వివాదాలు చుట్టుముట్టిన చారిత్రక చిత్రం ‘పద్మావత్‌’ లో సెన్సార్‌ బోర్డు సూచనల మేరకు చిత్రయూనిట్‌ పలు మార్పులు చేసింది. ఈ సినిమాపై కర్ణిసేన అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో ’ఘూమర్‌’ పాటలో ప్రధానంగా మార్పులు చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ పాటపై కర్ణిసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాణి పద్మావతిగా కనిపించిన దీపికా పదుకోన్‌ నృత్యం చేయడం, పాటలో ఆమె నడుము కనిపించడాన్ని ఆక్షేపించింది. రాణి పద్మావతి అలా గంతులేయడం ఏమిటని కన్నెర్ర జేసింది. ఈ పాటపై నృత్య ప్రదర్శన చేసిన పలుచోట్ల విధ్వంసాలకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ‘ఘూమర్‌’ పాటలో దీపిక నడుము కనిపించకుండా.. కంప్యూటర్‌ జెనరేటెడ్‌ వస్త్రంతో కవర్‌ చేశారు. సీబీఎఫ్‌సీ సలహాల మేరకు యూ/ఏ సర్టిఫికెట్‌ పొందేందుకు సినిమాలో ఈమేరకు కీలక మార్పులు చేసినట్టు చిత్రయూనిట్‌ అనధికారికంగా మీడియాకు తెలియజేసింది.

పద్మావత్‌ సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించినా ఈ నెల 25న చిత్రం విడుదల అవుతుందా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది. ఈ సినిమా విడుదలకు అనుగుణంగా అక్షయ్‌కుమార్‌ తన ‘ప్యాడ్‌మన్‌’ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. అయినా, కర్ణిసేన దిగిరాకపోవడం.. సినిమా విడుదలైతే.. తీవ్ర విధ్వంసం, పరిణామాలు తప్పవని హెచ్చరిస్తుండటంతో ‘పద్మావత్‌’  ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఉత్కంఠకు దారితీస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement