'నేనులోకల్' మూవీ రివ్యూ
టైటిల్ : నేనులోకల్

జానర్ : యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

తారాగణం : నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, సచిన్ కేడ్కర్

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

దర్శకత్వం : త్రినాథ్ రావు నక్కిన

నిర్మాత : దిల్ రాజువరుస హిట్స్తో దూసుకుపోతున్న నాని హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ నేనులోకల్. పక్కా యూత్ ఫుల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకుడు. నేను శైలజ సినిమాతో లక్కీ బ్యూటి అనిపించుకున్న కీర్తి సురేష్ నటించిన నేనులోకల్, నాని సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేసిందా..? సంక్రాంతి బరిలో బిగ్ హిట్ కొట్టిన దిల్ రాజు మరోసారి కొత్త సంవత్సరంలో రెండో విజయం సాధించాడా..?కథ :

బాబు (నాని) ఇంజనీరింగ్ పాస్ కావడానికి కష్టాలు పడుతుంటాడు. అన్ని ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాయడం చూడలేక.. ఎగ్జామ్ హాల్లో బాబును బరించలేక ఇన్విజిలేటర్ (సచిన్ ఖేడ్కర్) ఇక ఎగ్జామ్ హాల్ లోకి, తన జీవితంలోకి రావొద్దని స్వయంగా స్లిప్ ఇచ్చి మరి బాబును పాస్ చేయిస్తాడు. అలా ఇంజనీరింగ్ పాస్ అయిన బాబును అందరూ నెక్ట్స్ ఏంటి అన్న ప్రశ్నతో ఇబ్బంది పెడతారు.అదే సమయంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటనలో బాబు, కీర్తి( కీర్తీ సురేష్)ని కలుస్తాడు. అప్పుడు ఫిక్స్ అవుతాడు నెక్ట్స్ కీర్తిని లవ్ చేయాలని. కానీ ఏ ఇన్విజిలేటర్ అయితే ఇక నా జీవితంలోకి రావొద్దని చెబుతాడో.. అతని కూతురే కీర్తి. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకుంటే అది తెచ్చి ఇచ్చిన తండ్రి కోసం.. తను ఎవరిని చూపిస్తే వారినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది కీర్తి.కానీ అంత బలంగా నిర్ణయం తీసుకున్న కీర్తిని కూడా తన అల్లరితో లవ్ లో పడేస్తాడు బాబు. తెల్లవారితే కీర్తి, బాబుకు తన కూడా ప్రేమిస్తుందన్న విషయం చెపుతుందనుకుంటున్న సమయంలో ఈ ప్రేమకథ మలుపు తిరుగుతుంది. వారి ప్రేమకు మరో సమస్య ఎదురవుతుంది. బాబు, కీర్తిల ప్రేమకథకు ఎదురైన ఆ సమస్య ఏంటి..? కీర్తి వాళ్ల నాన్నను బాబు తమ పెళ్లికి ఒప్పించాడా..?నటీనటులు :

తనకు బాగా అలవాటైన పాత్రలో నాని మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అల్లరి అబ్బాయిగా, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించే ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు. రొటీన్ ట్రయాంగులర్ లవ్ స్టోరినే తన నటనతో పీక్స్కు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తోనే ఆకట్టుకున్న నాని ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించే ప్రయత్నం చేశాడు. (చూడండి: ‘నేను లోకల్‌’ ఎర్లీ రివ్యూ..!)నేను శైలజ తరువాత మరోసారి తెలుగు తెర మీద కనిపించిన కీర్తి సురేష్ హుందాగా కనిపించింది. చబ్బి లుక్స్లో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. నటుడిగా నానికి మంచి పోటి ఇచ్చాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో సచిన్ కేడ్కర్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. తెలుగులో ఎక్కువగా నెగెటివ్ రోల్స్ మాత్రమే చేసిన సచిన్ బాద్యత గల తండ్రి పాత్రలో నటించటం కొత్తగా అనిపించింది.సాంకేతిక నిపుణులు :

సినిమా చూపిస్త మామ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న త్రినాథ్ రావు నక్కిన మరోసారి అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎలాంటి బాద్యత లేని ఓ కుర్రాడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్న కథే మరోసారి తెరకెక్కించినా.. ఈ సారి మరింత ఎంటర్టైనింగ్గా చూపించటంలో సక్సెస్ అయ్యాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు తన మ్యూజిక్తో మరింత జోష్ తీసుకువచ్చే దేవీ శ్రీ ప్రసాద్ నేనులోకల్లోనూ తన మార్క్ చూపించాడు.మాస్ బీట్స్తో పాటు రొమాంటిక్ మెలోడీస్తో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ అందించాడు. దేవీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. సినిమా మేకింగ్లో పర్ఫెక్ట్గా ఉండే దిల్ రాజు మరోసారి తన లెక్క తప్పదని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్గా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.ప్లస్ పాయింట్స్ :

నాని పర్ఫామెన్స్

కామెడీ

క్లైమాక్స్మైనస్ పాయింట్స్ :

రొటీన్ క్యారెక్టరైజేషన్స్

సెకండాఫ్ లో కొన్ని సీన్స్ఓవరాల్గా నేనులోకల్ రొటీన్ యూత్ ఫుల్ లవ్ స్టోరినే అయినా.. పక్కా టైం పాస్ ఎంటర్టైనర్- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top