భిన్నమైన చిన్నపిల్ల..! | 'Nenem chinna pillana'.. a different movie! | Sakshi
Sakshi News home page

భిన్నమైన చిన్నపిల్ల..!

Sep 21 2013 12:52 AM | Updated on Aug 28 2018 4:30 PM

భిన్నమైన చిన్నపిల్ల..! - Sakshi

భిన్నమైన చిన్నపిల్ల..!

‘‘రెండేళ్ల విరామం అనంతరం మా సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి’’ అని డా.డి.రామానాయుడు అన్నారు.

‘‘రెండేళ్ల విరామం అనంతరం మా సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి’’ అని డా.డి.రామానాయుడు అన్నారు. సామాజిక అంశాలకు వాణిజ్య విలువలను మేళవిస్తూ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి.
 
 ఆయన దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. రాహుల్, తన్వివ్యాస్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడారు. ‘‘బలభద్రపాత్రుని రమణి కథ, సత్యానంద్ మాటలు, శ్రీలేఖ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి.
 
 తన్వికి ఇది తొలి సినిమా అయినా చాలా చక్కగా అభినయించింది. ఈ సినిమా తర్వాత తనకు విరివిగా అవకాశాలు వస్తాయి. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’’అని రామానాయుడు చెప్పారు. తన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, సురేష్ సంస్థలో వచ్చిన గత విజయాల చెంత చేరే సినిమా అవుతుందని సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ చిత్రంలో భాగమైనందుకు రాహుల్, తన్వి, బలభద్రపాత్రుని రమణి ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement