నేనెవరికి జన్మనివ్వలేదు: నటి

Neha Gowda Slammed Fake News About Her Giving Birth To A Child - Sakshi

బెంగళూరు: కన్నడ నటి, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ నేహ గౌడ ఫేక్‌ న్యూస్‌ బారిన పడ్డారు. ఈ నటి కాలిఫోర్నియాలో ఓ బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. గత కొద్దిరోజులుగా తనపై వస్తున్న వార్తలన్ని అసత్యమని కొట్టిపారేశారు. ‘ప్రచారంలో ఉన్న ఈ అసత్యపు వార్తలను నా దృష్టికి తీసుకొచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరం. అయితే ఈ ఆసత్యపు వార్తలు ఇంత​ త్వరగా వైరల్‌ అవ్వడం నన్ను మరింత కృంగదీసింది. ఇలాంటి వార్తలు రాసేవారికి నేను ఒకటి చెప్పదల్చుకున్నాను. (లాక్‌డౌన్‌లో చైతూకి ఇష్టమైంది ఇదేనంటా!)

ఈ వార్తలు రాయడంతో మీరు ఏం సాధిస్తారో తెలియదు కానీ ఎవరిపై అయితే అసత్యపు వార్తలు రాస్తారో వారు చాలా మనోవేదనకు గురవుతారు. దయచేసి ఓ వార్త రాసేటప్పుడు ఎవరి గురించి అయితే రాస్తున్నామో వారిని ఒకసారి అడగండి. కాలిఫోర్నియాలో నేను బిడ్డకు జన్మనిచ్చాను అనే వార్త రాసేటప్పుడు కనీసం నా కుటుంబసభ్యులతోనో, స్నేహితులతోనే మాట్లాడి ఉండొచ్చు కదా. ఇక ఈ వార్తలు వైరల్‌ చేసే వారికి కూడా నాదో చిన్న విన్నపం.. ఓ వార్తను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేసే ముందు తమకు కూడా ఓ అమ్మ, అక్క, స్నేహితురాలు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అంటూ నేహ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. (సుశాంత్‌ ఆత్మహత్య: సీబీఐ విచారణకు ఫోరం)

ఎయిర్‌హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహ నటనపై మక్కువతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. పలు కన్నడ చిత్రాల్లో చిన్నచిత్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కన్నడ బిగ్‌బాస్‌3తో మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top