అమ్మాయి... కారు... ఓ దెయ్యం! | Nayanthara's Dora movie releases on March 31st | Sakshi
Sakshi News home page

అమ్మాయి... కారు... ఓ దెయ్యం!

Mar 25 2017 11:58 PM | Updated on Sep 5 2017 7:04 AM

అమ్మాయి... కారు... ఓ దెయ్యం!

అమ్మాయి... కారు... ఓ దెయ్యం!

దెయ్యం కారును ఎందుకు ఆవహించింది..? కారుతో దెయ్యం ఎలా పగ తీర్చుకుంది..? అసలు నయనతారకు దెయ్యానికి గల సంబంధం ఏంటి..?

‘‘దెయ్యం కారును ఎందుకు ఆవహించింది..? కారుతో దెయ్యం ఎలా పగ తీర్చుకుంది..? అసలు నయనతారకు దెయ్యానికి గల సంబంధం ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే  ‘డోర’ చిత్రం చూడాల్సిందే’’ అని మల్కాపురం శివకుమార్‌ అన్నారు. నయనతార టైటిల్‌ రోల్‌లో దాస్‌  రామసామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘డోర’ ఈ నెల 31న విడుదల కానుంది.

తెలుగులో సుర„ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ విడుదల చేస్తున్నారు. శనివారం పాత్రికేయుల సమావేశంలో మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ వచ్చిన హర్రర్‌ చిత్రాల కన్నా ‘డోర’ డిఫరెంట్‌గా ఉంటుంది. కారులో దెయ్యం ఏ విధంగా ట్రావెల్‌ అవుతుందన్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమా తీయడం జరిగింది. నయనతార ఎంతో ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్‌ ఇది. ఆమె మంచి  కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది.

 చిన్నపిల్లలకు కనెక్ట్‌ అవుతుందని నయనతార కోరిక మేరకు టైటిల్‌ను ‘డోర’గా నిర్ణయించాం. టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని 400 పైగా థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. బయ్యర్లు ఉన్నప్పటికి సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకంతో వీలైన చోట్ల మేమే విడుదల చేసేందుకు ఫ్లాన్‌ చేస్తున్నాం.

వివేక్, మెర్విన్‌ కొత్తవారైనా మంచి మ్యూజిక్‌  అందించారు. దాస్‌ రామసామిగారికి ఇది మొదటి సినిమా అయినా బాగా చిత్రీకరించారు. ప్రస్తుతం డైరెక్ట్‌గా తెలుగులో మూడు చిత్రాలు చేసేందుకు ఫ్లాన్‌ చేస్తున్నాం. అందులో ఒకటి సమాజానికి ఉపయోగపడే కథతో డైరెక్టర్‌ కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నాం. సక్సెస్‌లో ఉన్న హీరోలు, డైరెక్టర్లతో మరో రెండు సినిమాలను ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement