మూగ పాత్రలో లేడీ సూపర్‌ స్టార్‌

Nayantharas Dark Comedy  COCO First Look - Sakshi

తమిళసినిమా: నయనతార ఇప్పుడు అభినయంతో కూడిన పాత్రలకే ఆమోదముద్ర వేస్తున్నారు.  అగ్రతార ఇమేజ్‌ను కాపాడుకునే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ కావడం లేదు. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న చిత్రాలన్నీ ఆ తరహావే అని చెప్పవచ్చు. త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నది గమనార్హం. 

నయనతార నటిస్తున్న చిత్రాల్లో కోకో ( కోలమావు కోకిల) ఒకటి. నయనతార నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికిన చిత్రాల్లో నానూ రౌడీదాన్‌ ఒకటి. అందులో నయనతార చెవిటి యువతి పాత్రలో అద్భుతంగా అభినయించి ప్రశంసలు పొందారు. ఈ పాత్రకుగానూ సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా నటిస్తున్న కోకో చిత్రంలో మూగ అమ్మాయిగా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

కొత్త దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె పాత్ర స్వరూపం, హావభావాలు, ధరించే దుస్తుల వరకూ చాలా వైవిధ్యంగా ఉంటాయట. అరమ్‌ చిత్రంలో పూర్తిగా విభిన్నంగా కనిపించిన నయనతార కోకో చిత్రంలో మరోసారి తనను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top