భయపెట్టే వసంతకాలం

Nayanthara Starring Vasantha Kalam Movie - Sakshi

నయనతార లీడ్‌ రోల్‌లో నటించిన ఓ తమిళ సినిమాని ‘వసంత కాలం’ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక, ప్రతాప్‌ పోతన్, రోహిణి హట్టంగడ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. సస్పెన్స్, హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత దామెర వి.ఎస్‌.ఎన్‌. శ్రీనివాస్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గతంలో ‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి చిత్రాలను తెలుగులో విడుదల చేశాం. ‘వసంత కాలం’ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top