‘దర్బార్‌’లో నయన్‌ ఎంట్రీ | Nayanthara Joins Rajinikanth Darbar Shooting | Sakshi
Sakshi News home page

‘దర్బార్‌’లో నయన్‌ ఎంట్రీ

Apr 24 2019 10:00 AM | Updated on Apr 24 2019 10:00 AM

Nayanthara Joins Rajinikanth Darbar Shooting - Sakshi

సూపర్‌స్టార్‌ దర్బార్‌లోకి లేడీ సూపర్‌స్టార్‌ ఎంటర్‌ అయ్యింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్‌. ఇందులో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న నయనతార  తాజాగా విజయ్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో నటిస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన దర్బర్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌.

తాజాగా మంగళవారం నటి నయనతార దర్బార్‌ చిత్రంలోకి ఎంటర్‌ అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్, నయనతారలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇందులో నయనతార, రజనీకాంత్‌కు జంటగా కాకుండా ఆయన పాత్రకు ధీటైన పాత్రలో నటించనున్నారట. పాత్ర చిత్రం అంతా ఉండటంతో 60 రోజులు కాల్‌షీట్స్‌ కేటాయించినట్లు సమాచారం. దర్బార్‌ చిత్రాన్ని ఏకధాటిగా మూడు నెలల పాటు షూటింగ్‌ నిర్వహించి పూర్తి చేసేలా చిత్ర యూనిట్‌ ప్రణాళికను రచించినట్లు తెలిసింది.

ఈ సినిమాలో రజనీకాంత్‌కు కూతురుగా నటి నివేదా థామస్‌ నటిస్తోంది. విలన్‌గా బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌బాబర్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా, సమాజ సేవకుడిగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది. భారీఎత్తున్న నిర్మిస్తున్న లైకా సంస్థ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో పొంగళ్‌కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతం, సంతోష్‌శివన్‌ ఛాయాగ్రహణ అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement