సినిమా అంతా ఒకే చీరతో..! | Nayanthara in Aramm | Sakshi
Sakshi News home page

సినిమా అంతా ఒకే చీరతో..!

Dec 4 2016 3:48 PM | Updated on Sep 4 2017 9:54 PM

సినిమా అంతా ఒకే చీరతో..!

సినిమా అంతా ఒకే చీరతో..!

ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీ నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే..? వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేస్తూనూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో...

ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీ నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే..? వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేస్తూనూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అలరిస్తోంది ఈ బ్యూటి. అదే స్థాయిలో భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్న నయన్, సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటి తమిళ్ నాట ఓ ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తోంది. లేడీ ఓరియంటెండ్ మూవీగా తెరకెక్కుతున్న అరమ్ సినిమా కోసం ఓ సాహసం చేస్తోంది.

ఈ సినిమాలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే కలెక్టర్ పాత్రలో నటిస్తున్న నయనతార సినిమా అంతా ఒకే కాస్ట్యూమ్ లో కనిపించనుందట. నీటి సదుపాయం లేని ఓ గ్రామానికి లేడీ కలెక్టర్ ఒక్క రోజులో నీరు ఎలా తెప్పించింది అన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించనుంది. మింజూర్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement