మ్యూజిక్‌ మ్యాజిక్‌

Nayanatara,Vignesh Shivan Attended A Musical Night At California - Sakshi

సమ్మర్‌ హాలిడేస్‌ స్కూల్‌ పిల్లలకే కాదు. అందరికీ వర్తిస్తుంది అంటున్నారు కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌. అన డమే కాదు క్విక్‌గా కొన్ని హాలిడేస్‌ కూడా తీసుకున్నారీ జంట. ఈ లవ్‌ కపుల్‌ వీలు దొరికినప్పుడల్లా హాలీడేకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడెక్కడకు వెళ్లారు అంటే.. మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు. అమెరికాలోని కొచెల్లా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్‌ ఇలా రకరకాల మ్యూజిక్, చాలా మంది ఆర్టిస్ట్స్‌ అందరూ కలిసి మ్యూజిక్‌ సంబరంగా జరుపుకుంటారు.

ఆ సంగీతాన్ని ఎంజాయ్‌ చేయడానికి వారం రోజుల వెకేషన్‌కు వెళ్లారు విఘ్నేశ్, నయన్‌. ఈ ట్రిప్‌లోని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు విఘ్నేశ్‌. ఈ ట్రిప్‌ విశేషాలని వివరిస్తూ–‘ ‘కొచెల్లాలో అమేజింగ్‌ టైమ్‌ స్పెండ్‌ చేశాం. నా స్టార్‌ (నయనతార)తో చిన్న మ్యూజికల్‌ జర్నీ. గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. స్టార్‌ సింగర్‌ బియాన్స్‌ పర్ఫార్మెన్స్‌ బెస్ట్‌ మూమెంట్స్‌ మాకు. చిన్న ట్రిప్‌తో సమ్మర్‌ వెకేషన్‌ ముగిసింది. ఇక బ్యాక్‌ టు వర్క్‌’’ అని పేర్కొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top