వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు | Navya Naveli Nanda Starts A Healthcare Portal | Sakshi
Sakshi News home page

వ్యాపార సంస్థను ప్రారంభించిన నవ్య నవేలీ నందా

May 14 2020 1:01 PM | Updated on Oct 5 2020 6:59 PM

Navya Naveli Nanda Starts A Healthcare Portal - Sakshi

ముంబై: ఇటీవల పట్టభద్రురాలైన బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నందా ఇంతలోనే స్వంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించారు. నవ్వ నవేలి నందా బిగ్‌బీ తనయురాలు శ్వేత బచ్చన్‌ నందా కూతురు. ఆమె న్యూయార్స్‌లోని ఫోర్థామ్‌యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఇటీవల పట్టా పొందారు. ‘ఆరా హెల్త్‌’ ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆరాహెల్త్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్య షేర్‌ చేశారు. ‘ఆరాహెల్త్’‌ అనేది మహిళ సాధికారితకు తోడ్పాటు అందించే వేదికని పేర్కొన్నారు. 

కాగా, నవ్య ప్రారంభించిన ఈ కొత్త వెంచర్‌లో ఆమెతోపాటు సభ్యులుగా అహిల్యా, మెహతా, మల్లికా సాహ్నీ, ప్రజ్ఞ సాబూలు ఉన్నారు. ‘మేము ఒక సాధారణ సమస్యను పరిష్కరించడానికి కలిసి వచ్చిన స్వతంత్ర యువతులం. మా విభిన్న నేపథ్యాలు, భవాలు కలిగి ఇతర మహిళలను శక్తివంతం చేయడంలో సహాయపడటానికి మాకు స్ఫూర్తినిచ్చాయి’ అంటూ ఆరాహెల్త్‌ అధికారిక ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేశారు. ఇక నవ్య కొత్త వెంచర్‌ను ఆమె తల్లి శ్వేతా బచ్చన్ ప్రమోట్‌ చేస్తూ.. ‘ధైర్యవంతమైన యువతులు... ఇప్పటి నుంచి ఎప్పటికీ’ అంటూ కామెంట్‌ పెట్టారు.

గత వారం శ్వేతా బచ్చన్ నవ్వ గ్రాడ్యూయేషన్‌ కంప్లీట్‌ చేసిన సందర్భంగా ముంబైలోని తమ జల్సా నివాసంలో పార్టీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్వేతా పంచుకున్నారు. ‘2020 క్లాస్.. ఈ ఏడాది నవ్వ తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పట్టభద్రురాలైంది. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసన ప్రతి ఒక్కరికీ ఒక వేడుక రాదు కాబట్టి మేము నవ్వను ప్రత్యేకంగా ఉంచాలని నిర్ణయించుకున్నాము.  ఐ లవ్‌ యూ బేబీ. నిన్ను చూసిన గర్వపడుతున్నాను’ అంటూ షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement