
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, హోస్ట్, ఫెమినా మిస్ ఇండియా 2006 నటాషా సూరి పెద్ద ప్రమాదానికి గురయ్యారు. బంగీ జంప్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఆ వివరాలిలా.. ఇండోనేషియాలో ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఇటీవల నటాషాకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఇండోనేషియా వెళ్లిన నటాషా ఓ లక్సరీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించారు.
సహజంగానే అడ్వెంటర్ గేమ్స్‌లో పాల్గొనడం, సాహసాలు చేయడం ఆమెకు అలవాటు. దీంతో స్టార్ ప్రారంభించిన తర్వాత బంగీ జంప్ చేసేందుకు వెళ్లారు. చాలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆమె కిందకి బంగీ జంప్ చేయగా.. నడుముకున్న తాడు తెడిపోయి ఆమె లోయలో పడిపోయినట్లు సమాచారం. అయితే కింద రాళ్లు లాంటివి లేకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే 24 గడిస్తే గానీ నటాషా సూరి పరిస్థితిని వెల్లడించలేమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
మిస్ వరల్డ్ - 2006 అందాల పోటీల్లో పాల్గొన్న నటాషా టాప్-10లో నిలిచారు. అనంతరం పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేశారు. బాలీవుడ్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటాషా.. 2016లో దక్షిణాది సూపర్‌స్టార్లలో ఒకరైన హీరో దిలీప్ సరసన కింగ్ లయర్ అనే మలయాళ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.