హడలెత్తించే బాసు... అల్లరి అమ్మాయి

Nannu Dochukunduvate to release on Vinayaka Chavithi - Sakshi

ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగులందర్నీ హడలెత్తించే మేనేజర్‌ అతను. అల్లరి చేసే ఓ గడసరి అమ్మాయి ఆ ఆఫీస్‌లో జాయిన్‌ అయ్యింది. ఆ తర్వాత జరిగిన హంగామాను వెండితెరపై చూడండి అంటున్నారు ‘నన్ను దోచుకుందువటే’ టీమ్‌. సుధీర్‌బాబు, నభా నటేశ్‌ జంటగా ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఒక్క సాంగ్‌ మినహా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ‘‘రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.

‘సమ్మోహనం’ వంటి హిట్‌ మూవీ తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. కొత్త హీరోయిన్‌ అయినప్పటికీ నభా నటేశ్‌ బాగా నటిస్తోంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కూడా స్టార్ట్‌ చేశాం. సెప్టెంబర్‌ 13న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు ఆర్‌.ఎస్‌. నాయుడు. నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్‌ నటిస్తున్న ఈ సినిమాకు అంజనీష్‌ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎస్‌. సాయి వరుణ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top