నన్ను దోచుకుందువటే

nannu dochukunduvate first look release - Sakshi

‘సమ్మోహనం’ వంటి హిట్‌తో మంచి ఊపుమీదున్నారు సుధీర్‌ బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభ నతేశ్‌ కథానాయిక. ఆర్‌.ఎస్‌.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై సుధీర్‌ బాబు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌.నాయుడు మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కోణంలో, కొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో రూపొందింది.

‘నన్ను దోచుకుందువటే’ టైటిల్‌ ప్రకటించగానే చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రొడక్షన్‌ విలువలు ఎక్కడా తగ్గకుండా సుధీర్‌బాబుగారు చూసుకున్నారు. కొత్త హీరోయిన్‌ అయినప్పటికీ నభ నతేశ్‌ చాలా బాగా చేశారు. అజనీష్‌ సంగీతం సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. చిత్రీకరణ పూర్తి చేశాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది’’ అన్నారు. నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి సౌందర రాజన్, సుదర్శన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. సాయి వరుణ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top