మరో విభిన్న పాత్రలో నాని..? | Nani, Hanu raghavapudi Film In Military Backdrop | Sakshi
Sakshi News home page

మరో విభిన్న పాత్రలో నాని..?

Jul 5 2017 11:13 AM | Updated on Sep 5 2017 3:17 PM

మరో విభిన్న పాత్రలో నాని..?

మరో విభిన్న పాత్రలో నాని..?

వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ శుక్రవారం నిన్ను కోరి

వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ శుక్రవారం నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేచురల్ స్టార్, మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా స్టార్ చేశాడు నాని.

ఈ సినిమాతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. నాని డ్యూయల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ విభిన్న చిత్రానికి ఓకె చెప్పాడు. ఈ సినిమా మిలటరీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నితిన్ హీరోగా 'లై' సినిమాను తెరకెక్కిస్తున్న హను రాఘవపూడి, లై రిలీజ్ తరువాత నాని సినిమా పనులు ప్రారంభించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement