రివెంజ్‌ లీడర్‌

Nani film gets September 13 release date - Sakshi

తన ప్లాన్‌ను మార్చుకుని ఆడియన్స్‌ కోసం కొత్త స్కెచ్‌ వేశాడు పార్థసారధి. గ్యాంగ్‌ సాహసాలను వచ్చే నెల చూపిస్తానంటున్నాడు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ‘‘నాని’స్‌ గ్యాంగ్‌లీడర్‌’’. ఈ చిత్రంలో రివెంజ్‌ రైటర్‌ పార్థసారధి పాత్రలో నటించారు నాని. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీని సెప్టెంబరు 13న నిర్ణయించినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్, ఫస్ట్‌ సాంగ్, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో విక్రమ్‌కుమార్‌ బాగా తెరకెక్కించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top