మరోసారి 'అష్టాచమ్మా' | nani confirms movie with indraganti mohan krishna | Sakshi
Sakshi News home page

మరోసారి 'అష్టాచమ్మా'

Nov 19 2015 1:32 PM | Updated on Sep 3 2017 12:43 PM

మరోసారి 'అష్టాచమ్మా'

మరోసారి 'అష్టాచమ్మా'

'భలే భలే మొగాడివోయ్' సక్సెస్ యంగ్ హీరో నానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

'భలే భలే మొగాడివోయ్' సక్సెస్ యంగ్ హీరో నానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సక్సెస్ తో ఆ క్రేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం 'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న నాని, ఆ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఏడేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు హీరోగా నానికి మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తూనే ఉంది. అష్టాచమ్మా సినిమా తరువాత 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు ఆ తరువాత' లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన మోహనకృష్ణ 'బందిపోటు'తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

దాదాపు ఏడేళ్ల విరామం తరువాత తన తొలి చిత్ర హీరో నానితో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు మోహనకృష్ణ. ఈ సినిమాతో మరోసారి అష్టాచమ్మా మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయాన్ని నాని స్వయంగా తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement