మరో ‘గాథ’కు రెడీ | Nani And Hanu Raghavapudi To Join Hands Again | Sakshi
Sakshi News home page

Jun 10 2018 1:06 PM | Updated on Aug 29 2018 9:26 PM

Nani And Hanu Raghavapudi To Join Hands Again - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా యువ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ సినిమా మంచి విజయం సాధించటంతో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. హను కూడా నాని సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే నితిన్‌ హీరోగా హను దర్శకత్వంలో తెరకెక్కిన లై నిరాశపరచటంతో నాని సినిమా వెనక్కి వెళ్లిపోయింది.

ప్రస్తుతం హను రాఘవపూడి, శర్వానంద్‌ హీరోగా పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాని, హనుల సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. పడి పడి లేచే మనసు సినిమాను నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌లోనే నాని, హనుల సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement