
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సినిమా యన్.టి.ఆర్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ఇప్పటికే రిలీజ్ అయ్యింది. యన్.టి.ఆర్ కథానాయకుడు పేరుతో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరచటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించినా.. ఇప్పుడు ఆలస్యమయ్యేలా ఉంది.
యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాను వారం ఆలస్యంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా మరింత ఆసల్యం కానుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా కాకుండా ఫిబ్రవరి 22న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇంతవరకు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.