రజనీపై నానా పటేకర్ కామెంట్స్ | Nana Patekar doesnt think Rajinikanth is a superstar | Sakshi
Sakshi News home page

రజనీపై నానా పటేకర్ కామెంట్స్

Jul 27 2016 8:17 AM | Updated on Sep 4 2017 6:35 AM

రజనీపై నానా పటేకర్ కామెంట్స్

రజనీపై నానా పటేకర్ కామెంట్స్

అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా....

అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా.. ఈ సినిమా కలెక్షన్ల రికార్డ్లను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్ రజనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓ ప్రైవేట్ ఈవెంట్లో మీడియా ప్రతినిధి కబాలి గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా 'ఇండియాలో సినిమానే సూపర్ స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్లు ఎవరూ లేరు. సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే కథ బాలేకపోతే స్టార్ హీరో సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది'. అంటూ కామెంట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement