నమితానందం | Namitha Participating in Sankranti celebrations | Sakshi
Sakshi News home page

నమితానందం

Jan 13 2014 11:29 PM | Updated on Jul 6 2018 3:37 PM

నమితానందం - Sakshi

నమితానందం

సంతోషాలు వెల్లివిరిసే పర్వదినం సంక్రాంతి. ప్రతి లోగిలి రంగవళ్లులతో కళకళలాడుతుంది. ప్రతి కుటుంబం తప్పనిసరిగా జరుపుకుని ఆనందానుభూతుల్ని

సంతోషాలు వెల్లివిరిసే పర్వదినం సంక్రాంతి. ప్రతి లోగిలి రంగవళ్లులతో కళకళలాడుతుంది. ప్రతి కుటుంబం తప్పనిసరిగా జరుపుకుని ఆనందానుభూతుల్ని పొం దే పండుగ సంక్రాంతి. తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) పండుగను అత్యంత విశేషంగా జరుపుకుంటారు. అలాంటి వేడుకల్లో అందాల తార నమిత మెరిస్తే ఇక ఆ ఆనందానికి అంతు ఉంటుం దా?. సరిగ్గా అలాంటి సంతోషాలు విరబూసిన కార్యక్రమం చెన్నై ఓల్డ్ మహా బలిపురం రోడ్డులోని ఎస్‌ఎంకే ఫామ్‌రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు నిర్వహించిన సంక్రాంతి వేడుకలు కనువిందు చేశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగిన ఈ వేడుకలకు అందాల భామ నమిత స్టార్ ఆఫ్ ఈవెంట్‌గా మారారు.

దరితో కలిసి పొంగలి వండి, విద్యార్థులతో గొంతు కలిపి తమిళ సంప్రదాయంతో మమేకమయ్యారు. వారు వండిన పొంగల్‌ను ఆరగించి ఆహా ఏమిరుచి అంటూ అభినందించారు. అనంతరం జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలో తాను సైతం అంటూ స్టెప్పులు వేసి కళాకారులను ఉత్సాహపరిచారు. తమిళులకే ప్రత్యేకమైన కరగాట్టం ఆడి తమిళ కళలపై తనకున్న మక్కువను చాటుకున్నారు. అనంతరం ఆ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన నిధిని పలు రూపాలలో పేదలకు నమిత చేతుల మీదుగా సంక్రాంతి కానుకగా అందించి వారిని సంతోషపరిచారు. సంగీత కార్యక్రమాలలో గాయకులతో నమిత గొంతు కలపడంతో ఆ ప్రాంగణమంతా సంతోష సాగరంగా మారింది. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విద్యార్థులను నమిత అభినందించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement