నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడు | My son is going to give me heart attack, says pop singer Aguilera | Sakshi
Sakshi News home page

నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడు

May 17 2016 7:40 AM | Updated on Sep 4 2017 12:18 AM

నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడు

నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడు

పాప్ సింగర్ తన కుమారుడి విషయంలో తీవ్ర కలత చెందుతోంది. తన కుమారుడు మాక్స్ ఏదో ఒక రోజు గుండెపోటు తెప్పిస్తాడంటూ పాప్ సింగర్ క్రిస్టినా అగ్విలెరా అంటోంది.

లాస్ ఏంజెలిస్: పాప్ సింగర్ తన కుమారుడి విషయంలో తీవ్ర కలత చెందుతోంది. తన కుమారుడు మాక్స్ ఏదో ఒక రోజు గుండెపోటు తెప్పిస్తాడంటూ పాప్ సింగర్  క్రిస్టినా అగ్విలెరా అంటోంది. పార్కర్ కు తన ఎనిమిదేళ్ల కొడుకు మాక్స్ బిగ్ ఫ్యాన్ అని, వాడి డేరింగ్ నెస్ ఎక్కువైనందుకు కాస్త కంగారు పడుతున్నట్లు పేర్కొంది. మాక్స్ ఎప్పుడూ వాడికి ఇష్టం ఉన్న పనులు చేస్తుంటాడు, వారి కెరీర్ కూడా వాడే డిసైడ్ చేసుకుంటాడని చెప్పింది. అగ్విలెరా పాల్గొన్న షో 'ది ఎల్లిన్ డిజెనరెస్ షో' మంగళవారం నాడు భారత్ లోనూ కొన్ని చానల్స్ లో ప్రసారం కానుందని ఆమె తెలిపింది.

మాక్స్ పెద్దయ్యాక ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ సర్క్యూ డు సొలేల్ లో జాయిన్ అవుతాడేమోనని అభిప్రాయపడింది. పార్కర్.. ప్రమాదకర క్రీడ అయినందున తాను భయపడాల్సి వస్తుందని పాప్ స్టార్ చెప్పుకొచ్చింది. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ పైకి దూకడం లాంటి పనులు చేయడం ఆ గేమ్ లో ఉంటాయని, ఇప్పటికే వాడు ట్రెయినింగ్ మొదలెట్టాడని అగ్విలెరా తెలిపింది. మాక్స్ చేసే స్టంట్స్, ఇతర యాక్షన్స్ వల్ల వాడికి ఏదైనా జరిగితే తనకు గుండెపోటు వచ్చేలా ఉందని పాప్ సింగర్ ఆందోళన చెందుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement