ఆమెతో ఎఫైర్ ఉందని ఎలా రాస్తారు? | My life is not for public consumption: Arbaaz Khan | Sakshi
Sakshi News home page

ఆమెతో ఎఫైర్ ఉందని ఎలా రాస్తారు?

Nov 7 2016 2:30 PM | Updated on Sep 4 2017 7:28 PM

ఆమెతో ఎఫైర్ ఉందని ఎలా రాస్తారు?

ఆమెతో ఎఫైర్ ఉందని ఎలా రాస్తారు?

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు.

ముంబై: తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు. తన భార్య మలైకా అరోరా స్నేహితురాలు యెల్లో మెహ్రాతో తాను సన్నిహితంగా ఉంటున్నట్టు ఇచ్చిన వార్తలను అతడు తోసిపుచ్చాడు. తన సినిమాల గురించి అడిగేందుకు అందరికీ అర్హత ఉందని, వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్బాజ్ ఖాన్ అన్నాడు.

'నా వ్యక్తిగత జీవితం గురించి ఇష్టమొచ్చినట్టు రూమర్లు రాశారు. మమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి సరిపోయింది. దీని ద్వారా కొంతవరకు మా వెర్షన్ వినిపించగలిగాం. యెల్లో మెహ్రా నాకు స్నేహితురాలు మాత్రమే. ఆమెతో కలిసి ఫొటో దిగితే మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేస్తారా? నేను 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోలు తీసుకుంటే వారందరితో కూడా సంబంధం అంటగడతారా? స్నేహితులతో సంతోషంగా ఫొటో దిగే హక్కు నాకు లేదా? మెహ్రా స్నేహితుడిగా ఆమెను ప్రమోట్ చేసేందుకు, అండగా నిలిచేందుకే ఫొటో తీసుకున్నాను.

మా స్నేహాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్టు రాశారు. ఒకవేళ మెహ్రాతో నాకు సీక్రెట్ ఎఫైర్ ఉంటే ఆమెతో దిగిన ఫోటోలను ఎందుకు బయటపెడతాన'ని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించాడు. తెలుగులో వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో అతడు నటిస్తున్నాడు. 'జై చిరంజీవి' తర్వాత  అర్బాజ్ ఖాన్ తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement