గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు! | My family does not judge me, says Manoj Bajpayee | Sakshi
Sakshi News home page

గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు!

Feb 18 2016 6:35 PM | Updated on Sep 3 2017 5:54 PM

గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు!

గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు!

తాను సినిమాలో 'గే' పాత్రలో నటించినా.. తన కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ అనరని విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి చెప్పారు.

తాను సినిమాలో 'గే' పాత్రలో నటించినా.. తన కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ అనరని విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి చెప్పారు. 'అలీగఢ్' అనే సినిమాలో ఆయన శ్రీనివాస రామచంద్ర సిరస్ అనే గే ప్రొఫెసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రొఫెసర్ మరో మగాడితో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియో బయటపడటంతో అతడు సస్పెండ్ అవుతాడు. అయితే మళ్లీ ఉద్యోగం ఎలా సాధిస్తాడు.. ఆ ప్రయత్నంలో ప్రాణాలు ఎలా కోల్పోతాడన్నదే సినిమా కథ. ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకుడు. ఇందులో రాజ్‌కుమార్ రావు జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు.

గే పాత్ర గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారని అడిగినప్పుడు.. తాను సినిమాలోనే చేస్తున్న విషయం వాళ్లందరికీ తెలుసని, అలాగే తాను సంప్రదాయ పాత్రలు పోషించనన్న విషయం కూడా తెలుసని, అలాంటప్పుడు వాళ్లకు తాను ఏ పాత్ర చేసినా సమస్య ఉండదని చెప్పారు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లాడు అంతా ఎంతగానో ప్రేమిస్తారని, తాను చేసే పనిని కూడా వాళ్లు ప్రేమిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement