అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయను: శ్రీదేవి | My comment was misunderstood and it concerns me, says Sridevi | Sakshi
Sakshi News home page

అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయను: శ్రీదేవి

Jun 23 2017 3:46 PM | Updated on Sep 5 2017 2:18 PM

అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయను: శ్రీదేవి

అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయను: శ్రీదేవి

తన కూతురు జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటే చూడాలనుందని నటి శ్రీదేవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

ముంబై: తన కూతురు జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటే చూడాలనుందని నటి శ్రీదేవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కూతురు అభివృద్ధిని కోరుకోకుండా సాధారణ తల్లిగా ఉండిపోవాలను భావిస్తున్నావంటూ శ్రీదేవిపై విమర్శలు వచ్చాయి. దీంతో సీనియర్ నటి శ్రీదేవి యూటర్న్ తీసుకున్నారు. ఆ విమర్శలపై శ్రీదేవి స్పందించారు. 'ఇటీవల జాన్వీ కపూర్ గురించి నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. నేను చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలకు పెళ్లే జీవిత పరమార్థం తాను చెప్పినట్లు ప్రచారం చేయడం నన్ను బాధిస్తోంది. కూతురిని పెళ్లి కూతురిగా చూడాలని ఉందని మాత్రమే చెప్పాను. ఇందులో తప్పేముంది.

నా కూతుళ్లు వారి కాళ్లపై నిలబడితే చూసి ఆనందించాలని ఉంది. ఎందుకంటే మహిళలు వారికంటే సొంత గుర్తింపు తెచ్చుకోవడం మంచిది. మీరు ఎంచుకున్న కెరీర్‌లో నిలదొక్కుకోవాలని నా కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు తరచుగా చెబుతుంటాను. అలా వృద్ధిలోకి వచ్చినప్పుడే మీకంటూ గుర్తింపు తెచ్చుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయగలరని నా పిల్లలకు ఎన్నోసార్లు వివరించాను. స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్లు గడిచినా మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే ఇప్పటికీ ఎన్నో సమస్యలు వారిని పొంచి ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై దృష్టి పెడితే మంచిది. కానీ ఆడవాళ్లు కేవలం పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడమే వారి పని అంటూ శ్రీదేవి అన్నారని ప్రచారం చేయడం బాధాకరమని' జాన్వీ కపూర్ పెళ్లి కామెంట్‌పై శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement