అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది! | My ambition when I was four years old was to be married | Sakshi
Sakshi News home page

అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది!

Mar 31 2015 11:26 PM | Updated on Sep 2 2017 11:38 PM

అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది!

అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది!

పెళ్లి గురించి అడిగితే కొంతమందికి కోపం వస్తుంది. ప్రియాంకా చోప్రా మాత్రం చాలా కూల్‌గా సమాధానం చెబుతారు.

పెళ్లి గురించి అడిగితే కొంతమందికి కోపం వస్తుంది. ప్రియాంకా చోప్రా మాత్రం చాలా కూల్‌గా సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ తన మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడలేదనీ, ఇక పెళ్లెలా చేసుకోననీ అన్నారు ప్రియాంక. పెళ్లయితే చేసుకోలేదు కానీ.. ఇప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు పెళ్లి కూతురయ్యానని ప్రియాంకా చోప్రా చెబుతూ -‘‘మీకో గమ్మత్త యిన విషయం చెబుతా. నాలుగేళ్ల వయసులోనే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. బోల్డంత మంది పిల్లలు కావాలనిపించింది. అప్పుడు నాకు పెళ్లంటే ఏంటో తెలియదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు. అదేంటంటే.. పెళ్లప్పుడు బాగా అలకరించుకుంటారు కదా. అందుకే, పెళ్లి చేసుకోవాలనుకున్నా. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లంటే చాలు.. పెళ్లి కూతురి వేషమే వేసేదాన్ని. కలర్‌ఫుల్ గాగ్రా, చోళీ, నుదుట ఎరుపు రంగు బొట్టు బిళ్ల, చేతి నిండా గాజులు, డిజైనర్ నెక్లెస్.. ఇలా ఓ రేంజ్‌లో ముస్తాబయ్యి, మురిసిపోయేదాన్ని. ఇక, నిజంగా ఎప్పుడు పెళ్లి కూతురవుతాననేది కాలమే చెప్పాలి’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement