హిమేష్ రేష్మియా మళ్లీ పెళ్లి | Music director Himesh Reshammiya Going To Marry Sonia Kapoor | Sakshi
Sakshi News home page

హిమేష్ రేష్మియా మళ్లీ పెళ్లి

May 11 2018 7:03 PM | Updated on May 11 2018 7:47 PM

Music director Himesh Reshammiya Going To Marry Sonia Kapoor - Sakshi

హిమేష్‌ రేష్మియా, సోనియా కపూర్‌ (పాత చిత్రం)

ముంబై : బాలీవుడ్‌లో పెళ్లిల సీజన్‌ నడుస్తోంది. మొన్న సోనం కపూర్‌, నిన్న నేహా ధూపియాల పెళ్లిళ్లు జరిగిపోగా.. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్‌ నటుడు, సంగీత దర్శకుడు  హిమేష్ రేష్మియా వచ్చి చేరారు. అయితే, హిమేష్‌కు ఇది రెండో వివాహం. 21 ఏళ్ల ప్రాయంలోనే కోమల్‌తో హిమేష్‌కు వివాహం జరిగింది. 22 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెరదించుతూ.. గత ఏడాది జూన్‌లో కోమల్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు స్వయమ్‌ ఉన్నాడు. ప్రస్తుతం అతని బాధ్యతను ఇరువురూ పంచుకుంటున్నారు.

అయితే హిమేష్‌ దంపతులు విడాకులు తీసుకోవడానికి అతనికి టీవీ నటి సోనియా కపూర్‌తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చాయి. అయితే తాము విడిపోవడానికి సోనియా కపూర్‌ కారణం కాదని, హిమేష్‌, కోమల్‌లు వివరణ ఇచ్చారు. విడాకులకు ముందు నుంచే సోనియా కపూర్‌తో ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్న హిమేష్‌, ఆమెని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడని అతని సన్నిహితులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి హిమేష్‌ ఇంట్లోనే సన్నిహితుల నడుమ పెళ్లి వేడుక జరగనుందని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement