మురుగదాస్ సినిమా రిలీజ్కు రెడీ | murugadoss, sonakshi sinha, akira first look | Sakshi
Sakshi News home page

మురుగదాస్ సినిమా రిలీజ్కు రెడీ

Jun 21 2016 12:49 PM | Updated on Sep 4 2017 3:02 AM

మురుగదాస్ సినిమా రిలీజ్కు రెడీ

మురుగదాస్ సినిమా రిలీజ్కు రెడీ

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ అకీరా. గజిని, హలీడే లాంటి సినిమాలతో నార్త్లో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న మురుగదాస్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ఈ సినిమాను...

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ అకీరా. గజిని, హలీడే లాంటి సినిమాలతో ఉత్తరాదిలో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ మురుగదాస్.. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు తొలిసారిగా ఓ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేసిన మురుగదాస్, తమిళ సూపర్ హిట్ సినిమా మౌనగురు చిత్రానికి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

చాలాకాలం కిందటే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ సినిమాపై ఎలాంటి సమాచారం ఇవ్వని దర్శకుడు మహేష్తో తీసే సినిమా పనుల్లో బిజీ  అయిపోయాడు. దీంతో అకీరా ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. అలాంటి వదంతులకు చెక్ పెడుతూ సెప్టెంబర్ 2న అకీరా రిలీజ్ అవుతుందంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మురుగదాస్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లోనూ నటించింది. అందుకోసం మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. 2015 మార్చ్లో మొదలైన అకీరా ఏడాదిన్నర తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement