రాజకీయాల్లో సినీ రచ్చ

Movie Stars In Political Partys - Sakshi

తమిళసినిమా: రాజకీయాల్లో సినీ తారల వెలుగులే కాదు రచ్చలు చాలానే చూస్తున్నాం. ప్రముఖ పార్టీల నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీలను నెలకొలిపి చరిత్ర సృష్టించిన వారు. నేరుగా సినిమాల నుంచి రాజకీయరంగప్రవేశం చేసి విజయం సాధించిన వారు ఉన్నట్లే, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో కి దిగి చర్చకు దారి తీసి రచ్చ చేసిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా నటుడు విశాల్‌ ఆర్కే.నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై నామినేషన్‌ దాఖలు చేసి, అది తిరస్కరణకు గురై ఎలా కలకలం సృష్టిస్తుందో కల్లారా చూస్తున్నాం. ఇదే విధంగా ఇంతకు ముందు చాలా సార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని సంఘటనలను చూద్దాం.

నటుడు ఎస్‌వీ.శేఖర్‌
ఎంజీఆర్‌ మరణానంతరం ఏడీఎంకే రెండుగా చీలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 1989లో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో నటుడు ఎస్‌వీ.శేఖర్‌ మైలాపూర్‌ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పో టీగి దిగారు.ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి గెలుపొందారు.ఎస్‌వీ.శేఖర్‌ కేవలం 650 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు.

టీ.రాజేందర్‌: నటుడు,దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఇలా పలు శాఖల్లో అనుభవం కలిగిన టి.రాజేందర్‌ 1980లో డీఎంకే పార్టీ ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత ఆయన మనస్పర్థల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తాయగ మరుమలర్చి కళగం అనే సంఘాన్ని ప్రారంభించారు. అలా టి.రాజేందర్‌ 1991లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే పార్టీ నేత జయలలిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిని పోటీకి నిలపకుండా టి.రాజేందర్‌కు మద్దతు పలికింది. అదే విధంగా 2006లోనూ టి.రాజేందర్‌ తన సొంత నియోజక వర్గం మైలాడుదురైలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

నటి రేవతి కూడా..
సహజ నటిగా పేరు పొందిన నటి రేవతి కూడా రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నించారు. 1996లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షణ చెన్నై నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక సంచలన నటుడుగా పేరొందిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపునకు దూరమయ్యారు. ఇలా ప్రతిసారి రాష్ట్ర శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సినీరంగానికి చెందిన తారలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తూ రచ్చ చేస్తూనే ఉన్నారన్నది గమనార్హం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top