ఫస్ట్‌ టైమ్‌ డబుల్‌ యాక్షన్‌ చేశాను | Mohini Telugu Pre Release Press Meet | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ టైమ్‌ డబుల్‌ యాక్షన్‌ చేశాను

Jul 24 2018 1:35 AM | Updated on Jul 24 2018 1:35 AM

Mohini Telugu Pre Release Press Meet - Sakshi

త్రిష

‘‘మోహిని’ కేవలం  హారర్‌ సినిమా కాదు. ఇందులో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సెకండ్‌ హాఫ్‌ అంతా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. అది చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని హీరోయిన్‌ త్రిష అన్నారు. త్రిష ముఖ్య పాత్రలో దర్శకుడు మాదేష్‌ రూపొందించిన హారర్‌ చిత్రం ‘మోహిని’. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్, శ్రీనివాస్‌ రావు పల్లెల, కరణం మధులత ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ  సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ– రిలీజ్‌ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరోయిన్‌ త్రిష మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్న నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్‌.

ఫస్ట్‌ టైమ్‌ నేను డ్యూయల్‌ రోల్‌ చేశాను. వైష్ణవి, మోహినీ పాత్రల్లో కనిపిస్తాను. రెండు పాత్రలకు పోలికే ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మా సినిమాను తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు మాదేష్‌  మాట్లాడుతూ – ‘‘హారర్‌ బేస్ట్‌ మూవీ అయినప్పటికీ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు.. అందుకే యు సర్టిఫికెట్‌ ఇస్తున్నాం అని సెన్సార్‌ వాళ్లు అన్నారు. 80 శాతం లండన్‌లో షూట్‌ చేశాం. త్రిషకు థ్యాంక్స్‌. చాలా స్టంట్స్, యాక్షన్‌ చేశారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రిషగారికి థ్యాంక్స్‌. త్రిషగారు బ్యాక్‌ విత్‌ బ్లాక్‌బాస్టర్‌. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.బి.గురుదేవ్, సంగీతం: వివేక్‌ మెర్విన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement