'నా పిల్లలు బిగ్ స్క్రీన్పై చూస్తారట' | 'Mohenjo Daro' already a winner: Hrithik Roshan | Sakshi
Sakshi News home page

'నా పిల్లలు బిగ్ స్క్రీన్పై చూస్తారట'

Aug 11 2016 6:37 PM | Updated on Sep 4 2017 8:52 AM

'నా పిల్లలు బిగ్ స్క్రీన్పై చూస్తారట'

'నా పిల్లలు బిగ్ స్క్రీన్పై చూస్తారట'

తాను నటించిన చిత్రం మొహంజదారో చిత్రం ఇప్పటికే ఓ విజేత అని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అన్నారు.

ముంబయి: తాను నటించిన మొహంజదారో చిత్రం ఇప్పటికే ఓ విజేత అని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అన్నారు. ఈ నెల(ఆగస్టు)12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ మీడియాతో హృతిక్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మొహంజదారో చిత్ర విశేషాలు చెబుతూ విజయం అనేది మనం దేనిని ప్రేమిస్తామో దానిని చేయడంలో ఉంటుందని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో విజయాలు, అపజయాలు ఏమిటో తెలుసుకున్నానని చెప్పారు.

ఇష్టపడి పనిచేయడంలోనే విజయం ఉంటుందని అన్నారు. ఈ సినిమా కోసం తానెంతో శ్రద్ధపెట్టి పనిచేశానని, గాయాలు కూడా అయ్యాయని అన్నారు. గౌరీకర్ తో తనకు ఇది రెండో చిత్రం అని, తొలిచిత్రం జోదా అక్బర్ సినిమాతోనే ఆయనపై తనకు విశ్వాసం పెరిగిందని, ఇది ఇప్పుడు మరింత రెట్టింపయిందని, ఆయన మంచి విలువలు ఉన్న దర్శకుడు అని హృతిక్ చెప్పారు. ఈ సినిమాను మీ కుమారులు చూశారా అని ప్రశ్నించగా.. వారు ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పైనే చూడాలని అనుకున్నారని, అందుకే ప్రివ్యూలో చూడలేదని, వారి రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు ఇంకా తెలియదని చెప్పారు. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement