సమ్‌థింగ్‌ స్పెషల్‌ | Mohanlal looks dashing as young Odiyan | Sakshi
Sakshi News home page

సమ్‌థింగ్‌ స్పెషల్‌

Mar 11 2018 1:38 AM | Updated on Aug 1 2018 2:29 PM

 Mohanlal looks dashing as young Odiyan - Sakshi

మోహన్‌లాల్

అస్సలు అనిపించదు. జస్ట్‌... గెస్‌ కూడా చేయలేం.. మోహన్‌లాల్‌ ఏజ్‌ని. అంతలా ఆయన ‘ఒడియన్‌’ సినిమా కోసం స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని ఆల్మోస్ట్‌ 20 కేజీల బరువు తగ్గారు. ఇంతగా కష్టపడి యంగ్‌ లుక్‌లోకి వచ్చారంటే.. సినిమాలో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏదో ఉండే ఉంటుంది. అదేంటో సిల్వర్‌ స్క్రీన్‌పై చూడడానికి మరెంతో టైమ్‌ లేదు. ఎందుకంటే ‘ఒడియన్‌’ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ స్టారై్టపోయింది.

మోహన్‌లాల్, మంజు వారియర్, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య తారలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివకుమార్‌ మీనన్‌ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఓ కొత్త దర్శకుణ్ణి నమ్మి అవకాశం ఇచ్చారంటే కథలో మంచి దమ్ము ఉండి ఉంటుందని ఊహించవచ్చు. మేజికల్‌ థ్రిల్లర్‌గా 1950–2000 టైమ్‌ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా మరో లుక్‌ను రిలీజ్‌ చేశారు మోహన్‌లాల్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement